Home Page SliderTelangana

తెలంగాణలో విందులు, వినోదాలపై నిఘా

హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న వివిధ ఫంక్షన్లు, పార్టీల్లో మద్యం వినియోగంపై ఆబ్కారీ శాఖ నిఘా విస్తృతం చేస్తోంది. సుంకం చెల్లించని మద్యం వినియోగంపై ఇప్పటికే దాడులు నిర్వహిస్తుండగా.. ఇకపై ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనుంది. ఫంక్షన్లలో మద్యం వినియోగానికి ముందుగా ఆబ్కారీ శాఖ నుండి ఈవెంట్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ అనుమతి తీసుకున్నవారు కూడా ఢిల్లీ, గోవా లాంటి ప్రాంతాల నుండి దొంగచాటుగా తీసుకొచ్చిన మద్యాన్ని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆబ్కారీ శాఖ కమిషనర్ శ్రీధర్, ఎక్సైజ్ ఈడీ వి.బి.కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నారు. ఈ వెంట్లకు అనుమతులు తీసుకోకపోవడం, ఎన్డీపీఎల్ మద్యం వినియోగించడంపై ఈ ఏడాది 302 కేసులు నమోదు చేశారు. 165 మందిని నిందితులుగా చేర్చి 35 వాహనాలను, రూ.61.13 విలువైన మద్యాన్ని జప్తు చేశారు.