Home Page SliderNational

ఆశ్చర్యం! దివంగత కరుణానిధి కనిపించారు..

తమిళనాడు డీఎంకే పార్టీ వజ్రోత్సవాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతిని ముప్పెరుంవిళా పేరుతో చైన్నైలో నిర్వహించారు. చెన్నైలోని నందనం వైఎంసీఏ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం ఈ వేడుకలు జరిగాయి. దీనిలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మాజీ సీఎం, పార్టీ ముఖ్యనేత దివంగత కరుణానిధి వేదికపై ప్రత్యక్షమయ్యారు. తన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ పక్కన ఆసనంలో కరుణానిధి కూర్చుని కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. దీనితో అందరూ ఆశ్చర్యపోయారు. ఏఐ ద్వారా కరుణానిధిని సృష్టించారు. స్టాలిన్ పక్కన కూర్చుని పెరియార్ లక్ష్యాన్ని, అన్నాదురై మార్గాన్ని డీఎంకే పార్టీ లక్ష్యాలను గురించి మాట్లాడారు. డీఎంకే పార్టీని అధికారంలోకి తెచ్చిన స్టాలిన్‌ను తలచుకుని హృదయం గర్విస్తోందని పేర్కొన్నారు.