సురేష్ రైనా రిటైర్మెంట్
క్రికెటర్ సురేష్ రైనా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఆయన అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా దేశవాళీ క్రికెట్‌తోపాటు, ఐపీఎల్‌కు సైతం గుడ్‌బై చెప్పాడు. యూపీలో ఇప్పటికే మంచి టాలెంటెడ్ యువ క్రికెటర్లు ఉన్నారని… యువకులకు అవకాశం ఇవ్వడం కోసం తాను దేశవాళీ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ బోర్డుతో పాటు బీసీసీఐకి వెల్లడించాడు. “ఇండియాకు, నా రాష్ట్రం యూపీకు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ రోజు నేను అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు రిటైర్మంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. అదే విధంగా నా కెరీర్‌లో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, సీఎస్‌కే, నా అభిమానులకు ధన్యవాదాలు“ అంటూ రైనా ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.