BusinessHome Page SliderLifestyleNational

సోషల్ మీడియాకు సుప్రీం వార్నింగ్..

సోషల్ మీడియా వేదికలు, సామాజిక మాధ్యమాలకు సుప్రీం కోర్టు తీవ్ర హెచ్చరిక చేసింది. ఓటీటీలు, సామాజిక మాధ్యమాలలో అశ్లీల కంటెంట్ ప్రసారంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పలు ఓటీటీలకు, సామాజిక మాధ్యమాలలో అశ్లీల కంటెంట్‌ను అడ్డుకోవాలని గతంలో దాఖలైన పిల్‌పై వాదనల సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అటువంటి కంటెంట్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లకు నోటీసులిచ్చింది.