R-5 జోన్‌లో పేదలకు ఇళ్లస్థలాలపై సుప్రీం తీర్పు
గత కొద్ది రోజులుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న R-5 జోన్‌లో పేదలకు ఇళ్లస్థలాలు కేటాయింపు కేసులో తుది తీర్పు వెలువడింది. రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వొచ్చని పేర్కొంది. ఈ విషయంలో సుప్రీం కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ కేఎమ్.జోసెఫ్, జస్టిస్ అరుణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. అయితే ఈ విషయంలో హైకోర్టు తుది తీర్పుకు కూడా కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. పట్టాదారులకు థర్డ్ పార్టీ హక్కు ఉండదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గతంలో అమరావతి CRDA లిమిట్స్‌లో భూములు పేదలకు కేటాయించరాదని, రైతులు హైకోర్టులో కేసువేశారు. రాష్ట్రప్రభుత్వ జీవోను వెనక్కు తీసుకోవాలని ఆందోళనలు చేశారు. అయితే హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో స్టే విధించమంటూ సుప్రీంను ఆశ్రయించారు. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వారి కోరిక ఫలించలేదని చెప్పాలి.