మదర్సాల విషయంలో ఎన్సీపీసీఆర్ సిఫార్సులపై సుప్రీం స్టే
మదర్సాల విషయంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సిఫార్సులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. విద్యాహక్కు చట్టాన్ని పాటించడం లేదని ఆరోపిస్తూ ప్రభుత్వ నిధులతో నడిచే మదర్సాలను మూసివేయాలని కేంద్రం, రాష్ట్రాలు తీసుకున్న తదుపరి చర్యలపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. ఉత్తరప్రదేశ్, త్రిపుర ప్రభుత్వాలు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సైతం కోర్టు నిలిపివేసింది. గుర్తింపు లేని మదర్సాలు అలాగే ప్రభుత్వ -ఎయిడెడ్ మదర్సాలలో చదువుతున్న ముస్లిమేతర విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేయాలన్న సూచనలపైనా స్టే విధించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ జమియత్ ఉలమా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రం, అన్ని రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది.