Home Page SliderNational

బైజూస్ కు సుప్రీం షాక్

బైజూస్ పై దివాలా ప్రాసెస్ ను ఆపాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్స్ ను సుప్రీం కోర్టు పక్కన పెట్టేసింది. బీసీసీఐ, బైజూస్ పేరెంట్ కంపెనీ థింక్ అండ్ లెర్న్ మధ్య రూ.158 కోట్లకు బకాయిలకు సంబంధించి సెటిల్మెంట్ జరగడంతో ఎస్సీలాట్ దివాలా ప్రాసెస్ ను ఆపింది. కానీ, చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఎస్సీ లాట్ ఇచ్చిన సెటిల్మెంట్ ఆర్డర్ ను తాజాగా కొట్టేసింది. బైజూస్ నుంచి అందుకున్న ఈ సెటిల్మెంట్ అమౌంట్ రూ. 158.9 కోట్లను క్రెడిటార్ల కమిటీ అకౌంట్లో డిపాజిట్ చేయాలని బీసీసీఐని ఆదేశించింది. ఎస్సీలాట్ తీర్పును సవాలు చేస్తూ యూఎస్ కంపెనీ గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ఎల్ ఎల్సీ వేసిన పిటీషన్ పై తాజాగా సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది.