వైఎస్ జగన్‌పై పిటిషన్లకు సుప్రీం నో..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జగన్ బెయిల్ రద్దుపై ఆయన వేసిన పిటిషన్‌ను బెయిల్ రద్దుకు కారణాలేమీ లేవని తోసిపుచ్చింది. అంతేకాక రఘురామ వేసిన జగన్ కేసులు వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను కూడా అంగీకరించలేదు. జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. సీబీఐ కేసులు కూడా మరో రాష్ట్రానికి బదిలీ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. దీనితో తన పిటిషన్లు వెనక్కి తీసుకున్నారు.

