Home Page SliderNational

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ పై సుప్రీం కీలక తీర్పు

అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనార్టీ హోదాపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 30 కింద అలీఘర్ ముస్లిం యూనివర్శిటీలో మైనార్టీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4:3 నిష్పత్తిలో 2024, నవంబర్ 8న ఈ తీర్పు వెలువరించింది. అయితే.. 1875లో స్థాపించబడిన అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనార్టీ హోదాను పునరుద్ధరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. 2024, ఫిబ్రవరి 1న తీర్పు రిజర్వ్ చేయగా.. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనార్టీ హోదా పునరుద్ధరణపై తీర్పు వెలువరించింది.