మోహన్‌బాబు కేసులో సుప్రీం కీలక ప్రశ్నలు
మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో సుప్రీం కోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. పిటిషనర్ తరపు న్యాయవాదిని మోహన్ బాబుకు జైలుశిక్ష వేయాలా? లేదా నష్టపరిహారం కోరుతున్నారా? అంటూ ప్రశ్నించింది. జర్నలిస్టులు లోపలికి వచ్చినంత మాత్రాన ఎందుకు దాడి చేశారు? అని మోహన్‌బాబు లాయర్ ముకుల్ రోహిత్గిని ప్రశ్నించింది. అయితే అది ఆవేశంలో చేసిన చర్య అని, కావాలని దాడి చేయలేదని, కుటుంబ వ్యవహారంలో జర్నలిస్టులు కల్పించుకుని వచ్చారని, వారికి నష్టపరిహారం ఇవ్వడానికి మోహన్ బాబు సిద్ధంగా ఉన్నారని లాయర్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీం సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సమయం కావాలని పిటిషనర్ న్యాయవాది కోరగా మూడు వారాల సమయంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అంతవరకూ మోహన్ బాబుపై చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.

