రిజర్వేషన్లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
బీహార్‌లో రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. విద్య, ఉపాధిపై 75 శాతం వరకూ రిజర్వేషన్లు ఇవ్వడంపై బీహార్ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదు. నితిష్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటాను 50 శాతం నుండి 65 శాతానికి పెంచేసింది. దీనికి తోడు ఈడబ్లూఎస్ కోటా కింద మరో 10 శాతం ఉండడంతో సమానత్వపు హక్కు ఉల్లంఘిస్తోందంటూ పౌరులు పిటీషన్లు వేశారు. దీని ప్రకారం ఆర్టికల్ 14,15,16 ప్రకారం సమానత్వపు హక్కు రాష్ట్రప్రభుత్వం కాలరాస్తోందంటూ హైకోర్టు మండిపడింది. దీనితో రాష్ట్రప్రభుత్వం వేసిన 10 పిటిషన్లను కూడా విచారిస్తామని పేర్కొంది. ఇందిరా సాహ్ని కేసులో సుప్రీం కోర్టు తీర్పును ఉదాహరణగా పేర్కొన్నారు.