Home Page SliderNational

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తిరుమల లడ్డూ వివాదం దర్యాప్తు విషయంలో నేడు సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం. లడ్డూ తయారీకి స్వచ్ఛమైన ఆవునెయ్యి వాడలేదని, జంతుకొవ్వు కలిసిందంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ దర్యాప్తు బృందంలో ఫుడ్ సేఫ్టీ అధికారి ఒకరు, సీబీఐ నుండి ఇద్దరు, సిట్ నుండి ఇద్దరు ఉండాలని ఆదేశించింది. ఈ బృందాన్ని సీబీఐ డైరక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షించాలని పేర్కొంది. విచారణ జరుగుతున్న తీరుతెన్నులపై పిటిషనర్లుకు అభ్యంతరాలు ఉంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హిందువుల మనోభావాలతో ఈ కేసు ముడిపడి ఉన్నందున ఎక్కడా అనుమానాలకు తావు లేకుండా దర్యాప్తు ఉండాలని కోర్టు ఆదేశించింది. ఈ దర్యాప్తు విషయంలో రాజకీయాలకు ఎక్కడా తావు లేకుండా ఉండాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది.