Home Page SliderNational

మణిపూర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం

మణిపూర్ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై నేడు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలో విచారణ జరిగింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విచారణ కోసం ప్రత్యేకంగా మహిళా న్యాయమూర్తులతో సిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తరపున న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరో రాష్ట్ర పోలీసులతో దర్యాప్తు చేయించమని కోరారు. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ కేంద్రానికి ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు మణిపూర్ అల్లర్లు మొదలయినప్పటి నుండి ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు? మహిళలపై ఎన్ని అమానుష ఘటనలు జరిగాయి?  ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? ఎంతమందిని అరెస్టు చేశారంటూ ప్రశ్నించారు. ఈ విచారణ కోసం ప్రత్యేకంగా మహిళా న్యాయవాదులతో సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. కపిల్ సిబల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగితే తమకు అభ్యంతరం లేదన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఈ విషయంలో తమకేమీ అభ్యంతరం లేదని తెలియజేశారు. దీనితో సుప్రీంకోర్టు అధ్వర్యంలో మహిళా న్యాయమూర్తులచే ఈ సిట్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలియజేసింది.