Breaking NewsHome Page SliderNational

మెడికల్ సీట్ల కేటాయింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

పీజీ మెడికల్‌ సీట్లలో రాష్ట్రాల కోటా చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పీజీ మెడికల్‌ సీట్ల కేటాయింపులో రాష్ట్రాలకు గతంలో ఉన్న 50శాతం స్థానికత కోటా చెల్లదని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. నీట్‌ మెరిట్‌ ఆధారంగానే రాష్ట్ర కోటా సీట్లను భర్తీ చేయాలని సూచించింది.తెలంగాణలో గత ప్రభుత్వంలో సొంత నిధులతో జిల్లాకో మెడికల్ కళాశాల నిర్మించుకోగా ఈ నిర్ణయంతో తెలంగాణ స్థానిక విద్యార్థులకు ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్లైంది.ఈ తీర్పుతో తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కేరళ విద్యార్థులకు తీవ్ర నిరాశ ఎదురుకానుంది.