Home Page SliderNational

గవర్నర్ కు సుప్రీంకోర్టు చీవాట్లు

తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. అదేవిధంగా ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి ధర్మాసనం చీవాట్లు పెట్టింది. బిల్లులు నిలిపివేసిన తేదీ దగ్గర నుంచి ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తామని జస్టిస్ జెబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో స్టాలిన్ ప్రభుత్వానికి కోర్టు లో ఘన విజయం దక్కింది. కాగా.. డీఎంకే ప్రభుత్వం పంపించిన 10 బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలపలేదు. దీనిపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆపొద్దని సుప్రీం వ్యాఖ్యానించింది. గవర్నర్ చర్య చట్ట విరుద్ధం, ఏక పక్షం అంటూ తీర్పు వెలువరించింది. గవర్నర్ ఆమోదం తెలపకుండా ఉంచిన తర్వాత బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేయలేరని తీర్పు ఇచ్చింది. అసెంబ్లీ ఆమోదించిన తర్వాత బిల్లులను తిరిగి సమర్పించినప్పుడు వాటిని క్లియర్ చేసి ఉండాల్సిందని బెంచ్ పేర్కొంది.