సుప్రీంలో కేసుల విచారణలు ప్రత్యక్షప్రసారం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈరోజు పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యాయాన్ని ప్రజలకు చేరువ చేసే అడుగు వేసారు. అదేమిటంటే కోర్టు ప్రొసీడింగ్స్‌ను ప్రత్యక్షప్రసారం చేయబోతున్నారు. సుప్రీం కోర్టు చరిత్రలోనే ఇది ప్రధమం. అన్ని కోర్టులు ఈ పద్దతి పాటించాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపిస్తూ ప్రసంగించారు. ఆయన ఉన్నత ప్రమాణాలను నెలకొల్పారని, ఎన్నో చారిత్రక తీర్పులు వెలువరించారని పేర్కొన్నారు.

ఇక ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితహామీల అంశంపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ధర్మాసనం ఏర్పాటుపై తదుపరి సీజేఐ నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ ఎన్వీ రమణ తెలియజేసారు. 2013 నాటి తీర్పు పునర్ పరిశీలనకు కోర్టు అంగీకరించింది. ఉచితాల అమలుపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసారు. ఇదంతా కూడా ప్రత్యక్ష ప్రసారం చేసారు. ప్రస్తుతం ఈ కేసు నాలుగు వారాల పాటు వాయిదా పడింది. ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని, ఈ హామీల కిందకు ఏంవస్తాయో, ఏంరావో తెలుసుకోవడం కష్టంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.