చండీగఢ్ మేయర్ ఎన్నికలో చెల్లని 8 ఓట్లను లెక్కించాలని సుప్రీం కోర్టు ఆదేశం
చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంలో రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్పై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల ఓట్లను రీకౌంటింగ్ చేయాలని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి చెల్లని ఎనిమిది బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బిజెపి, ఆర్ మధ్య ఉన్న ఎనిమిది “చెల్లని” ఓట్లను పరిశీలించింది. వాటిని మళ్లీ లెక్కించాలని, చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించడాలని పేర్కొంది. మొత్తం లెక్కించి ఫలితాల ప్రకటించాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన విజయం లభిస్తుంది.