NTAకు సుప్రీంకోర్టు నోటీసులు
నీట్ పరీక్షలో అవకతవకలపై, పేపరు లీకులపై స్పందించాలంటూ NTAకు(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. జూలై 8లోగా సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించింది. నీట్ పరీక్షపై వచ్చిన ఇతర పిటిషన్లతో కలిపి అదేరోజు విచారణ చేపడతామని పేర్కొంది. మెడికల్ పరీక్షకు హాజరైన అనేకమంది ఓఎంఆర్ షీట్లనే పొందలేదని ఒక లెర్నింగ్ యాప్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారిస్తూ కోచింగ్ సెంటర్లు ఎలా పిటిషన్లు దాఖలు చేస్తాయని ప్రశ్నించింది. ఈ అంశంలో మీ పాత్ర ముగిసిందని, చెప్పిన సేవలు అందించడంతోనే వారి పాత్ర ముగుస్తుందని పేర్కొంది. ప్రభుత్వం చేయాల్సిన పనులు మీరు చూడాల్సిన అవసరం లేదంది. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. నీట్ లీకులకు సంబంధించిన అనేక కేసులు పరిశీలిస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు.