ఏపీలో ఇసుక అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టులో విచారణ
ఏపీలో ఇసుక అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.కాగా దీనిపై నివేదిక ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును సమయం కోరినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఆగస్టు 2నాటికి దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ మధ్యంతర నివేదికను ఫైల్ చేసినట్లు సమాచారం.ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రతి ఇసుక రీచ్‌ను సందర్శించి అక్రమాలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది.