Andhra PradeshHome Page Slider

సిట్ దర్యాప్తుకు సుప్రీంకోర్టు బ్రేక్

తిరుమల లడ్డూలో కల్తీనెయ్యి వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సిట్ దర్యాప్తు అధికారులకు ఖంగుతిన్నట్టయ్యింది. దీనితో మరో మూడురోజుల పాటు గెస్ట్‌హౌస్‌లోనే మకాం వేయనున్నారు. ఎలాంటి దూకుడు చర్యలకు పాల్పడబోమని సిట్ అధికారులు చెప్పినట్లు సమాచారం. మరోపక్క సుప్రీంకోర్టు కల్తీ విషయంలో నిజానిజాలు తేల్చకుండానే ముఖ్యమంత్రి వేదికపై ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టింది. దీనితో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అనుమానం ఉంటే సెకండ్ ఒపినియన్ తీసుకోవాలని, అంతేకానీ భక్తుల మనోభావాలతో ఆడుకోకూడదని ధర్మాసనం పేర్కొంది. నెయ్యి కల్తీ జరగలేదని టీటీడీ ఉద్యోగులు ఎలా చెప్పారని ప్రశ్నించారు. టీటీడీ ఉద్యోగుల జవాబులకు, ముఖ్యమంత్రి సెప్టెంబర్ 18న లడ్డూపై చేసిన వ్యాఖ్యానాలకు స్పష్టత కావాలని కోరింది ధర్మాసనం.

దీనితో టీడీపీ కార్యకర్తలకు, నేతలకు, మంత్రులకు ఈ విషయంపై అనవసర వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది అధిష్టానం. న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను ఎలాంటి కామెంట్లూ చేయవద్దంటూ తెలుగుదేశం పార్టీ నేతలకు హితవు చెప్పింది. ముఖ్యమంత్రికి లడ్డూ నెయ్యిలో కల్తీ విషయంపై నివేదిక వచ్చాకే ప్రజలతో మాట్లాడారని మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయం విచారణలో ఉన్నందున ఎలాంటి కామెంట్లూ చేయవద్దని పేర్కొంది. మరోపక్క సిట్ విచారణ కూడా మందగించింది.