Home Page SliderTelangana

మురళీకి అండగా ఉంటా BJPకి ఓటేసి గెలిపించండి

నర్సాపూర్: ప్రజల అవసరాలు తనకు బాగా తెలుసునని బీఆర్ఎస్‌ ఇచ్చే అవినీతి సొమ్మును తీసుకోండని, ఓటు మాత్రం బీజేపీకి వేయాలని బీజేపీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే, ఈటల రాజేందర్ అన్నారు. నర్సాపూర్‌లో ఆ పార్టీ అభ్యర్థి మురళీయాదవ్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో శుక్రవారం ఈటల పాల్గొన్నారు. పైసలు తీసుకునే సమయంలో వారు ప్రమాణం చేయమన్నా, చేయండని ఏమీ కాదన్నారు. నామీద భరోసాతో మురళీమోహన్‌ను గెలిపించండని కోరారు. మురళీకి అండగా ఉంటానని ఈటల హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ను ఓడించేందుకే గజ్వేల్ నుండి పోటీచేస్తున్నా అని అన్నారు.