తెలంగాణ నుంచి ఆంధ్రకు చనిపోయిన కోళ్ల సరఫరా…
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళనను కలిగిస్తోంది. కొన్ని వారాలుగా చాలా ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో కోళ్లకు వైరస్ సోకి పెద్ద ఎత్తున చనిపోవడంతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. కోళ్ల ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు భారీగా తగ్గినా.. భయంతో చాలా వరకు చికెన్ తినేందుకు ఇష్టపడడం లేదు. అయితే.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి చనిపోయిన కోళ్ల సరఫరా చేస్తున్నారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద అధికారులు పట్టించుకోవడం లేదు. విస్సన్నపేటలో ఉన్న చికెన్ షాపులకు తెలంగాణకు చెందిన ప్రీమియం చికెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన చనిపోయిన కోళ్లు సరఫరా చేస్తున్నారు. ఈ దృశ్యం కెమెరాకి చిక్కటంతో.. గమనించి అక్కడ నుంచి హుటాహుటిన వెళ్లిపోయారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయాలు నెలకొన్న పరిస్థితుల్లో అధికారులు అప్రమత్తమై కోళ్ల పెంపకం యజమానులను హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు.

