తాతయ్య బాధ్యత నెరవేర్చిన సూపర్ స్టార్ రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా తాతయ్య బాధ్యతను నెరవేర్చారు. స్కూల్‌కు వెళ్లనంటూ మారాం చేస్తున్న తన మనుమడు వీర్‌ను స్వయంగా స్కూలుకు తీసుకెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఆయన కుమార్తె ఐశ్వర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిత్యం సినిమాలతో, షూటింగులతో ఉండే రజనీ ఇంటి బాధ్యతలను కూడా నెరవేర్చారని ఆమె కామెంట్ పెట్టారు. ఆఫ్ స్క్రీన్ అయినా, ఆన్ స్క్రీన్ అయినా మీరు ప్రతీ పాత్రను అత్యుత్తమంగా పోషిస్తారు నాన్న అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.