విజయవాడకు సూపర్ స్టార్ రజనీకాంత్
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడ వచ్చారు. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. రజనీకాంత్, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొంటారు. వేడుకల్లో పాల్గొనడానికి రావడంపై ఎలా ఫీలవుతున్నారన్న విలేకరుల ప్రశ్నకు ఆయన చిరువ్వుతో బదులిచ్చారు. ఇవాళ పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా చంద్రబాబు పాల్గొంటారు. ఎన్టీఆర్ ప్రసంగాల పుస్తకాలను ఈ సందర్భంగా రిలీజ్ చేస్తారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వంద ప్రాంతాల్లో వందో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.