Home Page SliderNational

సూపర్ స్టార్ ఫర్ ఏ రీజన్

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మంచిమనసును చాటుకున్నారు. సూపర్ స్టార్ ఫర్ ఏ రీజన్ అని నిరూపించుకున్నారు. తన అభిమానికి, వారి కుటుంబానికి అండగా నిలబడి వరాలిచ్చే దేవుడయ్యాడు. పెదప్రోలుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి మహేష్‌కు, అతని తండ్రి కృష్ణకు వీరాభిమాని. ఈ అభిమానంతోనే అతని పిల్లలకు అర్జున్, అతిథి, ఆగడు అంటూ మహేష్ బాబు సినిమా పేర్లు పెట్టాడు. అయితే దురదృష్టవశాత్తూ అతని కిడ్నీలు పాడయ్యి మంచానపడ్డాడు. విషయం తెలిసిన మహేష్ బాబు ఆ ముగ్గురి పిల్లల చదువుకు తాను సహాయపడతానని మాట ఇచ్చారు. వారి బాధ్యతను పూర్తిగా వహిస్తానన్నారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ షేర్ చేశారు.