NewsTelangana

విషమంగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం బాగానే ఉందని ఉదయం హీరో నరేష్ చెప్పగా.. తాజాగా ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి వైద్యులు కొద్ది సేపటిక్రితం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కృష్ణను కార్డియాక్ అరెస్టుతో ఆస్పత్రికి తీసుకొచ్చారని.. ఆయనకు కార్డియాలజిస్టుల టీమ్ చికిత్స అందిస్తోందన్నారు. 24 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతుందని.. కృష్ణ ఆరోగ్యం అత్యంత క్లిష్టంగా ఉందని వైద్యులు చెప్పారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్టు డాక్టర్లు ప్రకటించారు.