81 ఏళ్ల వయస్సులోనూ సూపర్ యాక్షన్ సీన్స్..అమితాబ్ వైరల్ వీడియో
81 ఏళ్ల వయస్సులో కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ “కల్కి 2898 AD” సినిమా కోసం హీరో ప్రభాస్‌తో సూపర్ యాక్షన్ సీన్స్ చేశారు. ఈ సీన్స్ కోసం సిద్ధమవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో బాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలలో నెంబర్ ఒన్‌గా ఉండే అమితాబ్, 60 ఏళ్ల వయస్సు దాటాక నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంచుకున్నారు. ఇప్పుడు ఈ వయస్సులో మహాభారత కాలంలోని అశ్వద్ధామగా ఆయన నటించి, వేల సంవత్సరాల వయస్సు ఉన్న యుద్ధవీరునిగా మెప్పించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకొనే, శోభన వంటి స్టార్లు నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ వారాంతానికి రూ.500 కోట్ల మార్క్ దాటవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా 191.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందని టాక్.

