బీఆర్ఎస్ నర్సాపూర్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి
పెండింగ్‌లో ఉన్న సీట్ల కేటాయింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కో అడుగు వేస్తోంది. తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రతిష్టాత్మక నియోజకవర్గం నర్సాపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి ఖరారయ్యారు. ఇప్పటి వరకు పార్టీలో ఉన్న విభేదాలను పరిష్కరించిన సీఎం కేసీఆర్ అక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కన్విన్స్ చేసి.. ఆయన చేతుల మీదుగానే బీఫామ్ అందించారు. దీంతో మొత్తం కథ సుఖాంతమయ్యింది. అయితే మదన్ రెడ్డి, కేసీఆర్ చెప్పినట్టుగా వింటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

