“విద్యార్థులకు వేసవి సెలవులు తప్పనిసరి”: కేరళ హైకోర్టు
కేరళ హైకోర్టు విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కాగా కేరళలో వేసవి సెలవుల్లో పాఠశాలల్లో క్లాసులు నిర్వహించడాన్ని కేరళ ప్రభుత్వం నిషేదించింది. అయితే దీనిపై కేరళలోని CBSE స్కూళ్లు రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. కాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు విద్యార్థులకు సానుకూలంగా తీర్పు నిచ్చింది. ఏడాదంతా చదువులతో కుస్తీ పట్టే విద్యార్థులకు వేసవి సెలవులు అవసరమేనని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ విచారణలో హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ..”హోంవర్కుల భయం లేకుండా విద్యార్థులు ఆహ్లాదంగా గడపాలన్నారు. వచ్చే ఏడాదికి ఉత్సాహంగా చదవడానికి సెలవులు ఉపయోగపడతాయని” పేర్కొంటూ..పిటిషన్లు కొట్టివేశారు. దీంతో CBSE స్కూల్ విద్యార్థులు,తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

