తగ్గనున్న వేసవితాపం-ఏపీలో చిరుజల్లులు
ఏపీ ప్రజలకు మండుటెండల నుండి విముక్తి లభించబోతోంది. వేసవితాపం తగ్గనుంది. నైరుతు రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతంలో మరో రెండురోజుల్లో ప్రవేశించబోతున్నట్లు అమరావతి వాతావరణశాఖ తెలియజేసింది. తమిళనాడు దక్షిణప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఇది విదర్భ నుండి దక్షిణ తమిళనాడు మీదుగా తెలంగాణా, రాయలసీమ మీదుగా కిలోమీటర్ ఎత్తులో విస్తరించి, బంగాళాఖాతం చేరుతుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాలలో ఈరోజు, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. కానీ ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులుండకపోవచ్చని, ఈదురు గాలులు ఉండొచ్చని తెలిపింది.
Read more:


 
							 
							