అబ్రాడ్ లో దుమ్మురేపుతున్న సుకుమార్ కూతురు
తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది పాన్ ఇండియా సినీ డైరెక్టర్ సుకుమార్ బండ్రెడ్డి కుమార్తె సుకృతీ వేణి.నాన్న ఇండియాలో రఫ్పాడిస్తుంటే…కుమార్తె ఇంటర్నేషనల్ లెవల్లో సత్తా చాటుతుంది. సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాందీతాత చెట్టు అనే సినిమాకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభిస్తుంది.అంతే కాదు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ పలు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ బాలనటిగా కూడా సుకృతీ వేణి పురస్కారం అందుకున్నారు. కాగా ఈ సినిమాకు సమర్పకురాలిగా బాలిక తల్లి తబితా సుకుమార్ వ్యవహరించగా, పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇదిలా ఉండగా ఈ మూవీని తెలుగులో ఈ నెల 24న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ తెలిపారు.
BREAKING NEWS: వీరంగం సృష్టించిన గంజాయి బ్యాచ్