చాటింగ్ సంగతి తెలిసిపోతుందనే భయంతో ఆత్మహత్య
అనుమానం పెనుభూతం అన్నారు పెద్దలు.అన్నట్లుగానే సామెతను నిజం చేస్తూ ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాయ్ ఫ్రెండ్‌తో చాటింగ్ చేస్తున్న విషయం అక్కకు తెలియడంతో భయపడి.. రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది.హైదరాబాద్ లోని జామై ఉస్మానియా రైల్వే ట్రాక్ పై పడిన యువతి మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు.సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అయితే తన బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడింది.విషయాన్ని తన అక్క ….తన తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందోనన్న ఆందోళనతో రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది.దీని కోసం హైద్రాబాద్ వరకు వెళ్లింది.చనిపోతూ లెటర్ రాసింది.తన చావుకి ఎవరూ కారణం కాదని,తల్లిదండ్రులకు తెలిస్తే ఏమైనా చేస్తారేమోనన్న భయంతోనే తనువు చాలిస్తున్నానని లేఖలో పేర్కొంది.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.