దేవుడు పిలిచాడని ఆసుపత్రి బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్
ఓ వృద్ధుడు దేవుడు పిలిచాడని ఆసుపత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులో మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు గాయపడ్డాడు. దీంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. అయితే.. తనని దేవుడు పిలుస్తున్నాడని తోటి రోగులతో వృద్ధుడు చెప్పాడు. కాసేపటికే ఆసుపత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

