Home Page SliderInternational

పాకిస్థాన్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లోని కంటోన్మెంట్ ప్రాంతంలో సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. సైనికులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. ఆఫ్గాన్ సరిహద్దులోని బన్నూలోని కంటోన్మెంట్‌లో ఈ దాడి జరిగినట్లు సమాచారం. సోమవారం నాడు 10 మంది ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. పేలుడు పదార్థాలతో గోడను కూల్చివేశారు. ఈ దాడిలో 8మంది సైనికులు, 10 మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ విషయం ఒకరోజు తర్వాత సైన్యం ప్రకటించింది. ఈ ప్రదేశానికి దగ్గరలోనే కీలక సప్లై డిపో ఉంది. మొదటగా ఇద్దరు ఆత్మాహుతి సభ్యులు దాడి చేశారని, వెనుక మరో 8 మంది వచ్చారని అధికారులు పేర్కొన్నారు. ఈ పేలుళ్ల శబ్దం 15 కిలోమీటర్ల దూరానికి వినిపించినట్లు ప్రత్యక్షసాక్షులు పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్ సమీపంలోని పాకిస్థాన్ సైన్యం తీవ్రముప్పును ఎదుర్కొంటున్నాయి. తాలిబన్లు డ్యూరాండ్ రేఖను అంగీకరించడం లేదు. గతేడాది డిసెంబర్‌లో కూడా డేరా ఇస్మాయిల్ ప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు దాడి చేశారు. అప్పుడు 23మంది సైనికులు మృతి చెందారు.