ఆలోచనాత్మకంగా సుహాస్ ‘గొర్రెపురాణం’ ట్రైలర్ విడుదల
రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె.. ఆలోచనాత్మకంగా సుహాస్ ‘గొర్రెపురాణం’ ట్రైలర్ విడుదలైంది. గత నెల ‘ప్రసన్నవదనం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మంచి విజయాన్ని అందుకున్న ఈ కుర్ర హీరో మరో సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. విలక్షణమైన పాత్రలతో తనకంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు టాలీవుడ్ యువ హీరో సుహాస్. ఆయన మెయిన్ క్యారెక్టర్ రోల్‌లో యాక్ట్ చేస్తున్న తాజా చిత్రం గొర్రెపురాణం. ఈ సినిమాకు బాబీ డైరెక్షన్ చేస్తుండగా.. ఫోకల్ సినిమాస్ బ్యానర్‌పై ప్రవీణ్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. విడుదలకు ఇంకా నాలుగు రోజులే ఉండడంతో ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక గొర్రె చేసిన పని వలన రెండు మతాలకు చెందిన ప్రజలు గొడవపడుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే అసలు గొర్రెకు హిందు, ముస్లింలకు మధ్య గొడవ ఏంటి.. రెండు మతాలకు చెందిన ఆ ఊరి ప్రజలు అసలు గొర్రెను ఎందుకు చంపాలి అనుకుంటారు. సుహాస్ జైలులో ఎందుకు ఉండవలసి వచ్చింది. గొర్రెకు సుహాస్‌కు మధ్య సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమాను అందరూ తప్పక చూసి తీరాల్సిందే.