Andhra PradeshNews

“ఇలాంటి దారుణాలు ఏపీలోనే జరుగుతున్నాయి”.. రోజా

తిరుపతి జిల్లా వడమాల పేటలో జరిగిన మూడేళ్ల చిన్నారిపై హత్యాచార ఘటనపై వైసీపీ నేత రోజా మండిపడ్డారు. బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దారుణాలు ఏపీలో తప్ప మరే రాష్ట్రంలోనూ జరగడం లేదన్నారు. గంజాయి, మద్యం మత్తులో యువత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని, ప్రభుత్వం, ముఖ్యమంత్రి సిగ్గుపడాలన్నారు. చిన్నారిని కర్కశంగా అందినచోటల్లా కుక్కలు కొరికినట్లు కొరికి అత్యాచారం చేసి, హంతకుడు తప్పించుకుని, ఏమీ తెలియనట్లు ప్రవర్తించాడని విమర్శించారు. కూటమి పాలన ఏర్పడిన కొద్ది కాలంలోనే ఇప్పటి వరకూ 100 వరకూ అఘాయిత్యాలు జరిగాయని, ఒక్కరిని కూడా పవన్ కళ్యాణ్ తొక్కి నార తీయలేదని మండిపడ్డారు.