ఇక నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ కట్..
ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రాయితీలు అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం ఈవీలకు డిమాండ్ పెరిగిందని, అమ్మకాలు జోరందుకోవడంతో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిందన్నారు. దీని వల్ల పరిశ్రమకు సబ్సిడీలు అవసరం లేదని కేంద్ర రవాణ శాఖ మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఈవీలపై జీఎస్టీ తక్కువగా ఉందని, ఇక నుంచి ఈవీల తయారీదారులు ప్రభుత్వం నుంచి రాయితీలు కోరడం సమంజసం కాదన్నారు. వచ్చే రెండు సంవత్సరాల్లో పెట్రోల్, డీజిల్ వాహనాలు, విద్యుత్ వాహనాల ధరలు ఒకేలా ఉంటాయని గడ్కరీ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్, హైబ్రీడ్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం త్వరలోనే ఫేమ్ 3 స్కీము తీసుకొస్తుందని కేంద్రమంత్రి ప్రకటించారు.

