Home Page SliderNational

పంత్ నిజమైన యోధుడన్న శుభమన్ గిల్

ప్రముఖ స్టార్ క్రికెటర్ ,ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ కొన్ని రోజుల క్రితం తనకు జరిగిన ఘోర కారు ప్రమాదం కారణంగా ఈ ఏడాది IPL కు దూరమైన విషయం తెలిసిందే. కాగా ఆయన నిన్న గుజరాత్ టైటన్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ చూసేందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకి వచ్చారు. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటన్స్ ప్లేయర్ శుభమన్ గిల్ పంత్‌తో దిగారు . కాగా ఆ ఫోటోను శుభమన్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇలా షేర్ చేయడమే కాకుండా “నువ్వు నిజమైన యోధుడివి.నువ్వు నవ్వుతూ ఉండటం చాలా సంతోషంగా ఉంది. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని శుభమన్ తెలిపారు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.