JNTU ఇంజనీరింగ్ సబ్జెక్టు మినహాయింపు కోసం విద్యార్థుల వెతలు
ప్రస్తుతం చదువంటేనే ఇంజనీరింగ్ అనేలా అయిపోయింది పరిస్థితి. అందులోనూ ప్రతిష్ఠాత్మకమైన JNTU కాలేజీలో ఇంజనీరింగ్ చదవాలంటే ఎమ్ సెట్‌లో మంచి ర్యాంకులు వచ్చి ఉండాలి. 2018లో బీటెక్‌లో చేరిన విద్యార్థులకు R18 నిబంధనలను JNTU అమలు చేస్తోంది. అంతకు ముందు R16 క్రింద ఇంజనీరింగ్ విద్యార్థులకు 186 క్రెడిట్స్ ఉండేవి. అప్పట్లో 180 క్రెడిట్స్ సాధించినా సరిపోయేది. 2017 నుండి దేశంలోని ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఒకే విధమైన క్రెడిట్స్ ఉండాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. అందువల్ల బీటెక్‌లో నాలుగేళ్లకు కలిపి 160 క్రెడిట్లకు పరిమితం చేస్తూ ఆమేరకు పూర్తి స్థాయిలో సాధిస్తే ఇంజనీరింగ్ పట్టా అందజేస్తారు.

అయితే ఈసారి చాలామంది విద్యార్థులు ఆస్థాయిలో క్రెడిట్స్ తెచ్చుకోలేక అనుత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ చివరి ఏడాది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపామని, R18 నిబంధనల ప్రకారం ఇప్పుడు సబ్జెక్టులు తగ్గిపోవడం వల్ల మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదనీ JNTU రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ వివరించారు. ఫలితాల తర్వాత క్రెడిట్స్ తక్కువగా వచ్చాయంటూ అనుత్తీర్ణత పొందామని విద్యార్థులు వర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. వర్సిటీ చరిత్రలోనే అత్యంత తక్కువ సమయంలో ప్రశ్న పత్రాలను మూల్యాంకనం చేసినట్లు పరీక్షల విభాగం అధికారులు ఫలితాలు ప్రకటింటారు. గతంలో కంటే అతి ఎక్కువగా 68శాతం ఉత్తీర్ణతశాతం నమోదు అయ్యింది. . కానీ క్రెడిట్స్ తక్కువగా వచ్చాయని, గ్రేస్ మార్కులు కలపలేదని, సబ్జెక్టు మినహాయింపులు ఇవ్వలేదని విద్యార్థులు వాపోతున్నారు. నిజానికి ఆయా వెసులుబాట్లు కల్పించినట్లు అధికారులు చెపుతున్నారు. ఇక ఈఏడాది చివరి సంవత్సరం విద్యార్థులకు సబ్జెక్టు మినహాయింపు లేనట్లే..