BRS బలహీనపడిన క్షణంలో విద్యార్థులే పావులు: రేవంత్ రెడ్డి
టిజి: రాజకీయంగా కేసీఆర్ బలహీనపడిన ప్రతీసారి విద్యార్థులను రెచ్చగొడతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వారి శవాల మీద పార్టీని నిర్మాణం చేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధిపొందడంలో భాగంగానే బీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందని అన్నారు. పరీక్షలు వాయిదా వేస్తే నిరుద్యోగుల జీవితాలు ఆగం అవుతాయని తెలిపారు.

