ఈ టీచర్ మాకొద్దు..
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణను మరిచి చితకబాదుతున్నాడని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడితోపాటు మధ్యాహ్న భోజన సిబ్బందిని, అటెండర్ లను భయభ్రాంతులకు గురి చేస్తున్న టీచర్ మాకొద్దని విద్యార్థులు, గ్రామస్తులు రోడ్డెక్కారు. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో జరిగింది. గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో రామ్ రాజయ్య అనే ఉపాధ్యాయుడు క్లాస్ రూంలో నిద్రపోతున్నాడని, పాఠాలు చెప్పాలని విద్యార్థులు అడిగితే విచక్షణారహితంగా చితకబాదుతున్నాడని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. ఉపాధ్యాయుడు నిద్రపోయే ఫొటోలు మీడియాకు చూపించారు.

