క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో విద్యార్థి మృతి
హైదరాబాద్ లోని ఓ కాలేజీలో విషాదం నెలకొంది. CMR కాలేజీలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో ఆడుతూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. కళ్ల ముందే తమ స్నేహితుడు మృతి చెందడంతో తోటి విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ విద్యార్థి ఖమ్మం జిల్లాకు చెందిన వాడు. కొడుకు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.