విషాహారం తిని విద్యార్ధిని మృతి
ఫుడ్ పాయిజన్ కారణంగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఆశ్రమ పాఠశాల విద్యార్ధిని శైలజా మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో సరైన పౌష్టికారం అందించకపోవడం,కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లిన అన్నాన్ని రీ కుక్ చేసి సర్వ్ చేయడం వల్లే విద్యార్ధిని శైలజ చనిపోయిందని ,బంధువులు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో శైలజ స్వగ్రామమైన దాబా పోలీస్ పహారాలోకి వెళ్లిపోయింది. ఆసిఫాబాద్ ,వాంకిడిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.ఆదివాసీలు,బీఆర్ ఎస్ శ్రేణులు…శైలజ మృతి ప్రభుత్వ హత్య అని ఆరోపిస్తూ ఆందోళనకు దిగడంతో భద్రతా దళాల వలయంలోకి ఈ గ్రామాలు వెళ్లాయి.కాగా మృతురాలు శైలజ సోమవారం చికిత్స పొందుతూ నిమ్స్ ఆసుపత్రిలో చినిపోయిన సంగతి తెలిసిందే.

