తెలంగాణలో బలంగా నైరుతి- రాష్ట్రంలో భారీ వర్ష సూచన
తెలంగాణరాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇవి రాష్ట్రమంతటా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడవచ్చని ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో కుమురం భీం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

