తెలంగాణా ఆర్టీసిలో సమ్మె సైరన్
తెలంగాణలో నాలుగేళ్ల తర్వాత కార్మికులు మళ్ళీ సమ్మె బాట పట్టనున్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసి కార్మిక సంఘాలు TGSRTC యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి. సోమవారం ఉదయం ఆర్టీసి ఎండి సజ్జనార్ ను ఆయన ఛాంబర్‌లో కలిసి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ఉచిత బస్సు పథకం తో ఆర్టీసిని దివాళా తీయించే కార్యక్రమానికి పూనుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఇంధన రహిత బస్సులు ప్రవేశపెట్టి తమ జీవనోపాధిని,ఉద్యోగ భద్రతను కాలరాసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు.తమ డిమాండ్లు పరిష్కరించకుండా గ్రీన్ జర్నీ పేరిట ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు.లేని పక్షంలో సామూహిక విధులు బహిష్కరణకు పూనుకుంటామని హెచ్చరించారు.