Breaking NewsHome Page Slider

బ్యాంకు ఉద్యోగుల స‌మ్మె…లావాదేవీలుంటే త్వ‌ర‌గా చేసుకోండి

బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్​ ఫోరం ఆఫ్​ బ్యాంక్ యూనియన్స్ ​(యూఎఫ్​బీయూ) మార్చి 23 అర్ధరాత్రి నుంచి మార్చి 25 అర్ధరాత్రి వరకు సమ్మెకు పిలుపునిచ్చింది. హైదరాబాద్​లో బుధవారం యూఎఫ్​బీయూ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్​ కె.ఆంజనేయప్రసాద్​, ఆంధ్రప్రదేశ్​ కన్వీనర్​ బీఎస్​ రాంబాబులు ఈ మేరకు ప్రకటించారు.బ్యాంకు కార్య‌కలాపాలు,లావాదేవీలు పెద్ద మొత్తంలో జ‌రిపే వారు స‌మ్మె విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే నిర్వ‌హించుకోవాల‌ని కోరుతున్నారు.