Home Page SliderTelangana

అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు

అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రాకముందే తొక్కిసలాట జరిగినట్లు సోషల్ మీడియాలో కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేయడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిజాలను వీడియో రూపంలో ఇప్పటికే ప్రజల ముందుకు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇప్పుడు కొందరు ఈ తప్పుడు వీడియోలను సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్నారని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను బద్నామ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంధ్య థియేటర్ ఘటనలో ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు ఉంటే వాటిని పోలీసులకు అందించాలని, ఎవరూ సొంత వ్యాఖ్యానాలు చేయొద్దని సూచించారు.