Home Page SliderNational

“నీట్ లీకేజ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం”:కేంద్ర మంత్రి

దేశంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది జరిగిన నీట్ ఎగ్జామ్‌ పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా నీట్ విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. మరోవైపు ప్రతిపక్ష నేతలందరు కూడా నీట్ పేపర్ లీక్‌ను నిరసిస్తూ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడారు. నీట్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోబోతున్నామని నీట్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. కాగా ఈ కేసులో నిందితులను వదిలిపెట్టబోమన్నారు. నీట్ లీకేజీపై ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. అయితే గతంలో రద్దు చేసిన పరీక్షల తేదీలను కూడా NTA త్వరలోనే విడుదల చేస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు.