జిహెచ్ఎంసి ఆఫీస్ లో వీధి వ్యాపారుల నిరసన
హైదరాబాద్ లోని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో వీధి వ్యాపారులు ఆందోళన చేపట్టారు. నిత్యం ట్రాఫిక్ పోలీసులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. చలాన్లు విధిస్తూ షాపులు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు పని చేసుకుంటే 500,1000 రూపాయలు వచ్చే షాపులకు వేలకు వేలు ఫైన్లు వేస్తూ ఇబ్బందులకు గురి పెడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుందని నిరసన తెలిపారు.