బంగ్లా సంక్షోభంలో విచిత్రంగా భారీ ఆదాయం..
ఆగస్టు నెలలో జరిగిన బంగ్లాదేశ్ సంక్షోభంలో ఒక వీధి వ్యాపారి లాభం పొందాడన్న వార్త విచిత్రంగా మారింది. అప్పటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా వేల మంది విద్యార్థులు ఢాకా రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. అనంతరం జరిగిన ఉద్రిక్తతలు హింసాకాండకు దారితీశాయి. ఆ సమయంలో మహ్మద్ సుమన్ అనే వీధి వ్యాపారి అవకాశంగా తీసుకుని, నిరసనకారులకు జాతీయజెండాలు, హెడ్ బ్యాండ్లు అమ్మి భారీ ఆదాయాన్ని పొందారు. ఈ విషయం తెలుసుకుని మీడియా వారు అలాంటి సమయంలో ‘భయం వేయలేదా’? అంటూ ప్రశ్నించగా, “ప్రతీ ఒక్కరూ ఎప్పుడైనా చనిపోవల్సిందే. ఇంక దేనికి భయపడడం” అని చెప్పడంతో అతడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.

